కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రికలో మంగళవారం ఉదయం 11 కేవీ విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. పడమరఖండ్రికలో సెంట్రింగ్ పనుల నేపథ్యంలో టేకి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇనుప ఊచలను క్రింద నుంచి పైకి లాగుతున్నప్పుడు, బిల్డింగ్ ఎదురుగా ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో వాసంశెట్టి శ్రీనివాస్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు.