Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఖమన గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి, 5 గురిపై కేసు నమోదు చేసిన వాంకిడి ఎస్ఐ మహేందర్

Asifabad, Komaram Bheem Asifabad | Aug 24, 2025
పేకాట స్థావరంపై వాంకిడి పోలీసులు దాడి చేసి, కేసు నమోదు చేశారు. వాంకిడి ఎస్ఐ మహేందర్ కథనం ప్రకారం..మండలంలోని ఖమన గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు తమకు వచ్చిన సమాచారంతో ఆదివారం దాడి చేశారు. ఈ దాడులలో 5 గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.10,820 నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎవరైనా పేకాట ఆడితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us