విద్యారంగ సమస్యలపై పోరుయాత్ర నిర్వహించనున్నట్లు PDSU కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్ చెప్పారు. ఆదివారం కామారెడ్డిలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 30 వరకు విద్యా రంగ సమస్యలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యా రంగ సంస్థల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.విద్యార్థులకు రావలసిన ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.