నిడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల మేరకు ఆదివారం సాయంత్రం ఒకరు వేగంగా దూసుకు వచ్చి జనాన్ని ఢీ కొట్టి, గోడవైపు దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలు అయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలియజేస్తున్నారు స్థానికులు. ఈ ఘటనపై నిడదవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.