మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో వన మహోత్సవం వన మహోత్సవ కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తూప్రాన్ మండల ప్రాథమిక పాఠశాలలో 75వ వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వనమహోత్సవ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ కలిసి కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాలకు చెట్ల ఆవశ్యకత తెలియజేయాలన్నారు. నేటి మొక్కలు రేపటి వృక్షలు అని, చెట్ల వల్ల స్వచ్ఛమైనా గాలి వస్తుంది అని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని అన్నారు.