కర్నూలు నగర ప్రజల భాగస్వామ్యంతో కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. ఈ నెల 2న అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ సర్వసభ్య సమావేశాన్ని తిరిగి సోమవారం ఉదయం 12 గంటలు నిర్వహించారు. కర్నూలు ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మేయర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, కమిషనర్ పి.విశ్వనాథ్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు.