స్వచ్ఛందంగా నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నేత్ర నేత్రదానానికి సంబంధించి ప్రతిజ్ఞ పత్రంపై నేత్రదానానికి స్వచ్ఛందంగా అంగీకారం తెలుపుతూ సంతకం చేసి ఎస్వీ మెడికల్ కాలేజ్ మరియు రుయా హాస్పిటల్ నేత్ర విభాగపు అధిపతికి అందించారు జిల్లా కలెక్టర్ తో పాటు ఆయన తండ్రి నేత్రాలను సైతం వారి మరణానంతరం అందించేలా ప్రతిజ్ఞ పత్రంపై సంతకం చేశారు