తిరుపతి జిల్లా తడ మండలంలోని 7 పంచాయితీలకు ప్రాణాదారంగా ఉన్న నెర్రి కాలువ గత ఏడాది భారీ వర్షాలకు లూథరన్ చర్చి వెనుక భారీ గండి పడింది. దీంతో అప్పట్లో వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎఫ్ డి ఆర్ నిధులతో 39 లక్షలు రూపాయలు మంజూరు చేయించారు. ఆ నిధులతో కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం కాలవ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ భారీ వర్షాలు పడక ముందే నెర్రి కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, అధ