పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్ది చోడ్ ర్యాలీని పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టారు. వాల్మీకిపురం మండల కేంద్రములోని ఆర్టీసీ బస్టాండ్ నుండి గాంధీ బస్టాండ్ వరకు నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బిజెపి ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వచ్చిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో దేశ ప్రజల ముందు ఉంచారని తెలిపారు.