మామిడికుదురు మండలం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న బాల బాలాజీ స్వామి వారి దేవస్థానంలో హుండీలను శుక్రవారం లెక్కించారు. మొత్తం 71 రోజులకు రూ 38,20,531 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ తెలియజేశారు. బంగారం 30 గ్రాములు, వెండి 5.6 గ్రాములు, పలు దేశాల కరెన్సీ నోట్లు లభించినట్లు ఈవో చెప్పారు.