నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ శివ లింగేశ్వర దేవాలయం 6 వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం 8 గం నుండి పంచామృతాభిషేకం, బిల్వర్చన, విశేష పుష్పాలంకరణ మహా మంగళహారతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా చేపట్టారు.11 మంది దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కన్యాదానం చేశారు. ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా సావుల్గిగి మఠం పీఠాధిపతి గురునాథ స్వామి హాజరై భక్తులకు ఆశీర్వచనం చేశారు.