అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు యూరియా సక్రమంగా పంపిణీ చేయాలంటూ స్థానిక ఆర్డీవో ఆఫీస్ వద్ద అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి , యూరియా, ఎరువులను రైతులకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏవో కు వినతి పత్రం అందజేశారు.