జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ముగిసేంతవరకు మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి అబ్దుల్లా, నాయకుడు సాయి ఉదయ్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు ఎక్సైజ్ & ప్రొహిబిషన్ శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ –“కులమతాలకు అతీతంగా బంధుమిత్రులు, స్నేహితులతో ఉత్సాహంగా జరుపుకునే వినాయక చవితి పండుగలో విచ్చలవిడిగా జరిగే మద్యం విక్రయాలు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. మద్యం సేవకులు భక్తులకు ఇబ్బందులు కలిగించడం, నిమర్జనాల సమయంలో గొడవలకు, అల్లర్లకు కారణమవడం తరచూ చూస్తున్నాం. ఇలాంటి పరి