కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గత మూడు రోజుల నుండి సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి నుండి వరుసలో చెప్పులు పెట్టి లైన్ కట్టారు. ఒక్క పట్టాదార్ పాస్ పుస్తకానికి ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.