పల్నాడు జిల్లా,నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో శనివారం రాత్రి ఓ గర్భిణీకి 108 సిబ్బంది అత్యావసర పరిస్థితుల్లో సుఖ ప్రసవ చేయించారు. ఆడివమ్మ ప్రసవ నొప్పులతో బాధపడుతుంది.కుటుంభ సభ్యుల సమాచారంతో 108 సిబ్బంది అడివమ్మను నరసరావుపేట ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో. మార్గమధ్యంలో ప్రసవ నొప్పులు అధికమవడంతో రోడ్డు పక్కన అంబులెన్స్‌ను నిలిపి వాహనంలోనే ఆమెకు 108 సిబ్బంది ప్రసవం చేయించారు.అనంతరం తల్లీ,బిడ్డను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.తల్లీ, బిడ్డకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆదివారం వైద్యులు మీడియాకు వెల్లడించారు.