ఒత్తిడిని జయించగలిగితేనే విజయం సాధ్యమని మానసిక వైద్య నిపుణుడు అల్లాడి సురేశ్ అన్నారు.ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఆయన మాట్లాడుతూ.. చిన్న కారణాలకే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.