ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ వెంకటేష్ శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో స్పోర్ట్స్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్య పైన ఎక్కువ ఏకాగ్రత పెట్టారని ఆయన తెలిపారు. పేద విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అదే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని తెలిపారు.