వినాయక చవితి పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణంలోని నిజం చెరువులో చేపడుతున్న నిమజ్జన ఏర్పాట్లను మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్తు, గజ ఈతగాళ్లు, క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తులు ఇందుకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు