నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం లోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా భూభారతి పోర్టల్ ను ఏప్రిల్ 17 న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఖాజీపూర్ గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖాజీపూర్ గ్రామం జూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ఫోర్టల్ ను ప్రారంభిస్తారని తెలిపారు.