Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: ఈనెల 13న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలతో సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 4, 2025
జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో సెప్టెంబర్, 13 వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ సి.హెచ్.రమేష్ బాబు గారు తెలిపారు. గురువారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను మరియు రాజీ పడాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us