వినాయక విగ్రహాలను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని అయితే వాటిని వ్యాపార పరంగా వినియోగించుకుంటే కఠిన చర్యలు చేపడతామని స్పష్టమైన ఆదేశాలు ముందే జారీ చేసినట్లు గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం టిడిపి కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహాలు వద్ద ఎలాంటి చలనలు వేయకూడదని పార్కింగ్ ఫీజులు ముఖ్యంగా దర్శనం టికెట్లు కి ఎలాంటి అనుమతులు లేవన్నారు అలా ఎవరైనా వసూలు చేస్తే వారి పైన కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.