ఏలూరు జిల్లా పెదవేగిలోని డిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ శివ కిషోర్ తో కలిసి తమిళనాడుకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ సందీప్ రాయి రాథోడ్ సందర్శించారు ఈ సందర్భంగా పెదవేగి ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ సిబ్బందికి శిక్షణలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు గురించి క్షుణ్ణంగా పరిశీలించారు శిక్షణ సిబ్బంది నివాసాలు ఆహార పదార్థాల నాణ్యత మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రూపొందించిన పాఠ్యాంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు శిక్షణలో సమగ్రత మరియు నాణ్యతను గురించి ఈ సందర్శన జరిగిందని తెలిపారు..