Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: గణేష్ శోభయాత్ర రూట్ మార్గాన్ని పరిశీలించిన డిసిపి భాస్కర్

Mancherial, Mancherial | Sep 3, 2025
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా నుండి ఐబి చౌరస్తా వరకు గణేష్ శోభయాత్రకి ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు రూట్ మార్గాన్ని బుధవారం మధ్యాహ్నం డిసిపి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఎలాంటి అవాంతరాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఇంటర్నెట్ మరియు కేబుల్ వైర్లు నిమజ్జనం రోజు శోభయాత్రకు అడ్డుగా ఉంటే తీసివేయాలని సూచించారు. వినాయక మండప నిర్వహకులు సాయంత్రం 6 గంటల వరకు గణనాధుని వాహనంలో ఎక్కించి మెయిన్ రోడ్డుకు రావాలని తెలిపారు. గణనాథుని శోభాయాత్రకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us