ఇటీవల నంద్యాలలో ప్రమాదకరంగా మారుతున్న కుక్కల సంచారంపై మున్సిపాలిటీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ పాదచారులపై దాడి చేయడం, పసి పిల్లలను లాక్కెళ్లడం, యాక్సిడెంట్లకు కారణమవడం వంటి వాటికి కారణమవుతున్నాయి.దీంతో శుక్రవారం నంద్యాల, బొమ్మల సత్రం ప్రాంతంలో కుక్కలను పట్టి ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్నారు.