అక్రమంగా ఆటోలో తరలిస్తున్న కలప దుంగలను పట్టుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు గిన్నెదరి ఫారెస్ట్ అధికారి సరోజ తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. తిర్యాణి మండలం చింతలమదరకి చెందిన శంకర్ ఆటోలో టేకు దుంగలను తరలిస్తుండగా అనుమానం వచ్చి అపగా ఆపకుండా వేగంగా వెళ్ళాడు. దీంతో అటవీ సిబ్బంది ఆటోను వెంబడించి ఉల్లిపిట్ట గ్రామం వద్ద పట్టుకున్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు 12,000 ఉంటుందన్నారు. కలపతో ఆటో ను స్వాధీనం చేసుకొని ఆసిఫాబాద్ ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకెళ్లి అతనిపై కేసు నమోదు చేశారు.