“మహిళలను గౌరవించిన నాడే దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలి” అని అఖిలభారత మహిళా సంఘం (ఐద్వా) నగర కార్యదర్శి కే. అరుణ పిలుపునిచ్చారు.కర్నూలు నగరంలోని 23వ వార్డు శ్రీరామ్‌నగర్‌లో నాగులకట్ట రామాలయం పక్కన ఐద్వా ఆధ్వర్యంలో విస్తృత సాయి సమావేశం జరిగింది. ఆర్. నలిని అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్. ఉమాదేవి, వార్డు కార్యదర్శి కే. నాగజ్యోతి, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. నరసింహులు తదితరులు హాజరయ్యారు.మహిళలను ఉద్దేశించి కే. అరుణ మాట్లాడుతూ> దేశ జనాభాలో సగం మహిళలే అయినా వారికి గౌరవం, రక్షణ లభించడం లేదన