పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎంపీ ఈటల రాజేందర్ శనివారం మధ్యాహ్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ శోభయాత్రలో పాల్గొన్నారు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేసి గణేశుడు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.