జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు భూపాలపల్లి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. మానేరు నుండి కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా ఇసుకను అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్నారని, సబ్ డివిజన్ ఏ కాకుండా జిల్లా కేంద్రానికి కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు