నేషనల్ స్పేస్ డే క్విజ్ 2025 పోటీలో పాల్గొనాలని తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాలి తెలిపారు. అంతరిక్ష శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని నేషనల్ స్పేస్ డే క్విజ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఉంటుందని పాల్గొన్న వారికి సర్టిఫికెట్ తో పాటు మూడు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని సంబంధిత వివరాలను వెల్లడించారు