ఆన్ లైన్ రుణ యాప్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత యాప్లను నమ్మవద్దని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఎస్సై దస్తగిరి, ఎస్ఎం జి శ్రీనివాస్ అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం సైబర్ నేరాల పట్ల ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత యాప్లను ఇన్స్టాల్ చేయవద్దని అన్నారు.