మంగళవారం మధ్యాహ్నం అయిజ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలుర పాఠశాల)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీ సందర్భంగా పాఠశాల సమయములో విద్యార్థులందరూ గైర్హాజరుగా ఉన్నారు.దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇది ప్రభుత్వ సెలవు కాదు. అధికారికంగా కూడా ఎటువంటి సెలవు లేదు.అయితే విద్యార్థులను అనుమతి లేకుండా విద్యార్థులను ఇంటికి ఎందుకు పంపించారు?” అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.