చింతకాని ఎస్ఐ నాగుల్ మీద మరియు సిబ్బందితో నామవరం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో బోనకల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఓ ట్రాక్టర్ టక్కుతో సహా వస్తున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి వెనక్కి తిప్పుకునే క్రమంలో పోలీసులు గమనించి వెంబడించి పట్టుకొని విచారించగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం దుబ్బాకులపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల చింతల నరేంద్ర, అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఉదయ్ కిరణ్ ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించగా ట్రక్కును దొంగిలించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు