ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఆరెళ్ల బాలిక తలసేమియాతో బాధపడుతున్న నేపథ్యంలో చిన్నారి వైద్యం కోసం 13 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అందించారు. ఈ సందర్బంగా బుధవారం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. PMNRF నుంచి రూ.3 లక్షలు, CSR కింద రూ. 10 లక్షల మంజూరుకు కృషి చేశారన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఆపద్బాంధవుడిలా తోడైన MPకి జీవితాంతం రుణపడి ఉంటామని బాలిక తల్లిదండ్రులు పిల్లా దుర్గాప్రసాద్ దంపతులు అన్నారు.