నేపాల్ సందర్శనకు వెళ్లిన ఆంధ్రులు అక్కడ అల్లర్లలో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చాకచక్యంగా వ్యవహరించి కేంద్ర విమానయాన శాఖతో మాట్లాడి ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కు చెందిన యాత్రికులను శుక్రవారం సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చారు. నేపాల్ వెళ్లిన వారిలో కడప జిల్లా బద్వేల్ పట్టణం అశోక్ నగర్ కు చెందిన మారెళ్ళ శ్రీనివాస్ మరియు ఆయన సతీమణి సుశీల ఉన్నారు. వారిని సురక్షితంగా ఈరోజు బద్వేల్ లోని వారి స్వగృహానికి చేర్చారు. ఈ సందర్బంగా వారిని బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రితేష్ రెడ్డి కలిశారు.