ఏడాదిలో 72 లక్షల టన్నుల చెత్త తొలగించాం: మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో పాటు, 85 లక్షల టన్నుల చెత్తను కూడా వదిలి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఆదివారం మద్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన స్తానిక మచిలీపట్నంలోని డంపింగ్ యార్డును సందర్శించి మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో 72 లక్షల టన్నుల చెత్తను తొలగించామని చెప్పారు. మిగిలిన చెత్తను కూడా అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.