అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న డీలర్లకు కూడా త్వరలో స్మార్ట్ ఈపాస్ మిషన్లు అందిస్తామని సివిల్ సప్లైస్ జిల్లా అధికారి అడపా ఉదయ భాస్కర్ చెప్పారు. మామిడికుదురు మండలం పాశర్లపూడిలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. వినియోగదారులు సులభంగా రేషన్ సరుకులు తీసుకునే విధంగా ఈపాస్ మిషన్లు కూడా ఆధునీకరించామని చెప్పారు. ఓటీపీ, ఫేస్ రికగ్నైజేషన్, క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉందన్నారు.