గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువు 25 వ లైన్ లో నివాసముంటున్న బీహార్ రాష్ట్రానికి చెందిన పఠాన్ యూసఫ్ ఖాన్ తన 16 నెలల బాలుడు బాత్రూం బకెట్ లోని నీటిలో పడి మృతి చెందాడని ఫిర్యాదు చేసినట్లు లాలాపేట సీఐ శివప్రసాద్ ఆదివారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.