నల్లగొండ జిల్లాలోని డి 40 కాలువ ద్వారా చివరి ఆయకట్టు ప్రాంత రైతులకు సాగునీరును అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. శుక్రవారం సిపిఎం తిప్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అధ్యయన పాదయాత్ర 2వరోజు సందర్భంగా వివిధ గ్రామాల్లో పర్యటించారు గ్రామాల్లోకి వెళ్లే లింకు రోడ్లు అద్వానంగా ఉన్నాయని ప్రజలు ప్రయాణించే స్థితిలో లేవని వెంటనే లింకు రోడ్లను తారు రోడ్లుగా మార్చాలని పెండింగ్లో ఉన్న మామిడాల నుండి గోదావరి గూడెం మీదుగా చిరుమర్తి పోయే రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని పెండింగ్లో ఉండటం వల్ల ప్రజల ఇబ్బంది పడుతున్నారన్నారు.