ఏటూరునాగారం ఐటిడిఏ గిరిజన దర్బారులో సమర్పించిన దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని ఏపీవో వసంతరావు అన్నారు. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన గిరిజన దర్బారుకు వచ్చిన వివిధ ప్రాంతాల గిరిజనులు మొత్తం 20 దరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు. ఆయా దరఖాస్తులను వివిధ సెక్టార్ అధికారులకు సమర్పించి వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఐటిడిఏ ఎస్ఓ రాజ్కుమార్, డిడి పోచం తదితరులు పాల్గొన్నారు.