శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్పీ రత్న గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు వల్ల రానున్న రోజుల్లో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు సులువు అవుతుందన్నారు. జిల్లాలో 345 మ్యాట్రిక్స్ కెమెరాలు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో 2700 కెమెరాలు, కదిరి, హిందూపురం, మడకశిర ప్రాంతాల్లో సబ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పెనుకొండ ధర్మవరం పుట్టపర్తిలో కూడా సబ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.