కాకినాడజిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామం నుంచి పెద్ద ఎత్తున పలువురు వైసిపి వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం శుభదాయకమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వారందరిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని గ్రహించి పలువురు పార్టీలోకి చేరడం శుభపరిణామం అని పేర్కొన్నారు