మేల్మరువత్తూరు కు ఓం శక్తి భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు టు డిపో మేనేజర్ రూపశ్రీ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆర్టిసి డిపో కార్యాలయంలో కార్తిక మాసం సందర్భంగా చిత్తూరు డివిజన్ పరిధిలో టు డిపో 17 బస్సు సర్వీసులను నడిపిందని, ఇందుకు ఉత్తమ ప్రతిభ కనబరచిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లను ప్రశంసా పత్రంతో అభినందించారు. మీడియాతో మాట్లాడుతూ ధనుర్మాసంలో కూడా జిల్లాలోని అన్ని దేవాలయాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఓం శక్తి భక్తుల కోసం మేల్మరువత్తూర్ కు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసామన్నారు