సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఈసారి గణేశ్ నిమజ్జనాలను ముందుగానే చేపట్టారు. ఐదవ రోజు ఆదివారం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. అయితే వివిధ శాఖల అధికారులు సరైన సౌకర్యాలు కల్పించలేదని, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.