Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: నెల్లిమర్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బొలెరో వాహనం, వ్యక్తి మృతి

Vizianagaram, Vizianagaram | Sep 3, 2025
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పై బుధవారం సాయంత్రం 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. గుర్ల మండలం గిరిడ గ్రామానికి చెందిన యువకుడు దాసరి సురేష్ తన ద్విచక్ర వాహనంపై గుర్ల నుండి విజయనగరం వెళుతుండగా... విశాఖ నుండి గరివిడి వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా రహదారంతా రక్తపాతం అయింది. కొనఊపిరితో ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us