అల్లూరి ఏజెన్సీ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరి పొలాలు కొట్టుకుపోయే పరిస్థితిలో ఏర్పడ్డాయి జిమాడుగుల మండలం రాళ్లగడ్డ వద్ద వాగు ఉధృతి కారణంగా వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న వరి చేను పూర్తిగా కొట్టుకుపోయింది. గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో స్థానిక రైతులు వీడియోలను పాడేరు మీడియాకు చేరవేశారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టం ఉన్న ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులు పర్యటించి పంట నష్టం అంచనా వేసి గిరిజన రైతులకు న్యాయం చేయాలంటూ స్థానిక రైతులు కోరుతున్నారు.