యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సర్పంచుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులు పల్లె దావకానాలను పరిశీలించి అభివృద్ధి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పారిశుద్ధ్యం వైద్య ఆరోగ్య సేవలు గురించి అధికారులు సర్పంచుల బృందానికి వివరించారు.