కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో హనుమంతు వయసు 50 సంవత్సరాలు అనే వ్యక్తి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హనుమంతు హమాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో కుటుంబానికి భారం కావడంతో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో విచారిస్తున్న పోలీసులు.