కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలోని తన స్వగృహంలో శుక్రవారం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి తనను కల్సిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన వారి సమస్యలు తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కొందరు ప్రజల సమస్యలపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలు చర్చించారు. వారికి పలు సూచనలు ఇచ్చారు.