వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని మంగపేట మండలం మల్లూరు ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ నాయకులు శనివారం మధ్యాహ్నం రాస్తారోకో చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులకు నేటి వరకు పరిహారం అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని, BRS ప్రభుత్వంలో రైతును రాజులుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.