రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేదలకు నివాస స్థలాలు, నివాసాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక 11వ వార్డు సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు, ఈ సందర్భంగా సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన ప్రజల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత 20 సంవత్సరాలుగా ఆదిరెడ్డి మిషన్ సమీపంలో 30 కుటుంబాల పేద ప్రజలు ప్రైవేటు స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు, వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్, అన్ని అర్హతలు ఉన్న ప్రభుత్వ నివాసాలు, నివాస స్థలాలు మాత్రం దూరంగా ఉన్నారు.